Monday, December 23, 2024

నారాయణఖేడ్లో కబ్జాలకు కేరాఫ్.. భూపాల్ రెడ్డి: రేవంత్

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నారాయణఖేడ్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచులకు బిల్లులు రావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని బొందపెట్టాలని అన్నారు. ఇక్కడ వలసలు ఆగలేదని…నారాయణఖేడ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దొరల ప్రభుత్వాన్ని దించేందుకు అందరు ఏకం కావాలన్నారు.

కబ్జాలకు కేరాఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అని… నల్లవాగును పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఎక్కడికి పోయిండని రేవంత్ మండిపడ్డారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేన్నారు. అధికారంలోకి రాగానే రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. నారాయణఖేడ్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని.. నారాయణఖేడ్ ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాననని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News