Monday, December 23, 2024

బిజెపి యువతను మోసం చేసింది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్‌: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ యువతను మోసం చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. తొమ్మిదేళ్లు గడిచినా ఉద్యోగాలు ఇవ్వకుండా.. మతం పేరుతో యువతను రెచ్చగొట్టి బీజేపీ ఓట్లు దండుకుంటోందని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్ లో మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి చెప్పిందని.. ఈ తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా.. మరి ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన చెప్పారు. తొమ్మిదిన్నర ఏళ్లల్లో తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు.

చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని.. ఇప్పుడిప్పుడే తెలంగాణను బాగు చేసుకుంటున్నామని.. మళ్లీ కాంగ్రెస్ వస్తే గోసపడతామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువు బస్తాలు, కరెంట్ కోసం రైతులు తిప్పలు పడ్డారని.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్.. రైతులకు రైతుబంధు ఇస్తూ అండగా నిలబడ్డారని చెప్పారు. తెలంగాణలో రైతు రాజు కావాలన్నా.. అభివృద్ధి పనులు కొనసాగాలన్నా మళ్లీ బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని హరీష్ రావు ప్రజలను అభ్యర్థించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News