Monday, December 23, 2024

దళిత ఓట్ల కోసం బిజెపి బిగ్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

మందకృష్ణ ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు
ప్రత్యేక హెలికాప్టర్ సిద్దం చేస్తున్నట్లు పార్టీ వర్గాల వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి ఎన్నికల ప్రచారానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెళ్లుతున్నట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళితుల ఓట్ల కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయనతో బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఆయనకు ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిన ఈనెల 24, 25, 26 తేదీల్లో ప్రచారం చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజుల కితం మంద కృష్ణమాదిగ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో దళితులు బిజెపికే మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

అంతటితో ఆగకుండా ఇప్పటి వరకు ఏపార్టీ బిసి ముఖ్యమంత్రి ప్రకటించలేదని, బిసిలు కూడా ఆలోచించి కమలం పార్టీ విజయ తీరాలకు చేర్చాలని సూచించారు. దీంతో ప్రజల నుంచి స్పందన రావడంతో ఆపార్టీ పెద్దలు మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సభలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తుంది. దళితలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ బిగ్ స్కెచ్ వేసిన సంగతి ఇటీవల నిర్వహించిన విశ్వరూపం సభతోనే తేలిపోయింది. 19 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలుండగా జనరల్‌లో మరో రెండు స్థానాలను కేటాయించి దళితులకు పెద్ద పీట వేశామని ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వారి ఓట్లన్నీ బీజేపీ వైపు పడేలా ప్లాన్ చేస్తున్నారు. వారి ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లించేలా మందకృష్ణ సేవలను పార్టీ వినియోగించుకోవాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News