- Advertisement -
హైదరాబాద్ : ఓటింగ్ ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించే చర్యలలో భాగంగా అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ లలో ఒకటైన వండర్ లా హాలిడేస్ టికెట్లపై ఆఫర్‌ను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు హైదరాబాద్ పార్క్ వద్ద తమ ఓటింగ్ మార్క్‌ను చూపించటం ద్వారా టిక్కెట్‌లపై 15 శాతం తగ్గింపును పొందవచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు అందుబాటులో ఉంటుంది.
- Advertisement -