బ్రిటిష్ వాళ్లనే ఎదిరించాం.. మోడీకి భయపడతామా?
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ పగబట్టారు తెలంగాణ ఫలితం దేశమంతటా ప్రభావం
అలంపూర్ ‘ప్రజాగర్జన’ సభలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
తెలంగాణలో వచ్చే ఫలితం దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్, నల్లగొండలో నిర్వహించిన కాంగ్రెస్ ‘ప్రజాగర్జన’ ఖర్గే హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ పగబట్టారన్నారు. భారత దేశ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ని వాసాన్ని ఇడి స్వాధీనం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇడి దాడులు చేసి దేశంతో పాటు తెలంగాణ ప్రజలను భయపెట్టాలని చూస్తున్నార ని ఆయన ధ్వజమెత్తారు. కానీ, మోడీకి, బిజెపికి కాంగ్రెస్ పార్టీ భయపడదని ఆయన తేల్చి చెప్పారు.
బ్రిటిష్ వాళ్లకే కాంగ్రెస్ భయపడలేదు.. అలాంటిది మోడీకి భయపడుతుందా అని ఆయన ప్రశ్నించా రు. ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకమైనవని ప్రతి ఒక్కరూ ఆలోచిం చి ఓటు వేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు వెంటనే అమలు చేస్తామని వీటి ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశం యావత్తు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావాలన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించిన జవహర్‌లాల్ నెహ్రూకు సం బంధించిన రూ. 780 కోట్ల బిజెపి ప్రభుత్వం జప్తు చేసిందన్నా రు. బిజెపి ప్రభుత్వం రాజకీయ కుట్ర పన్నుతున్నదని ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం రో జున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చే శారు. ఈ కార్యక్రమంలో సినీనటి విజయశాంతి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , మంద జగన్నాథం, సంపత్‌కుమార్, బండారి భాస్కర్, గద్వాల, అలంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
మన ప్రతినిధి