Monday, December 23, 2024

గ్యాస్ డీలర్లకు సిలిం’డర్’

- Advertisement -
- Advertisement -

ధరలు తగ్గిస్తూ అన్ని పార్టీల మేనిఫెస్టోలు

ఎన్నికలు పూర్తయ్యేదాకా ‘బుకింగ్’లు వాయిదా
‘స్పేర్ సిలిండర్’ వినియోగదారుల్లో వేచిచూసే ధోరణి
ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష వరకు తగ్గిన బుకింగ్‌లు లబోదిబోమంటున్న డీలర్లు

రాష్ట్రంలో మహిళలను అమితంగా ఆకర్షిస్తున్న సిలిండర్ల మేనిఫెస్టోల అమలు సంగతి అటు ఉంచితే అప్పుడే ఆ ప్ర భావం ఎల్‌పిజి డీలర్లపై పడింది. ఒక్క జంట నగరాల్లోనే మూడు కంపెనీలకు చెందిన 120 ఏజెన్సీల పరిధిలో లక్ష ఎల్‌పిజి సిలిండర్ల బు కింగ్‌లు ఆగిపోయాయి. మిగతా హామీలు ఒక్కో వర్గానికి పరిమితం అయితే సిలిండర్లు మాత్రం సంపన్నుల నుంచి పేదల దాకా అంతా వాడుతున్నారు. అయితే ఆ సిలిండర్ ధర బిజెపి రూ. 1155 దాకా పెరిగి కర్నాటక ఎన్నికల త ర్వాత రూ. 955కి పడిపోయింది. కానీ ఈ ధర కూడా భరించలేక పేద, మధ్య తరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇది అ న్ని ప్రధాన పార్టీలకు ఎన్నికల ఎజెండాగా మారింది.

కర్నాటక ఎన్నికల్లో రూ. 500కే సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీనితో మేల్కొన్న కేంద్రం సిలిండర్ డేంజర్ ఎఫెక్ట్ గమనించి రూ.200 తగ్గించిం ది. రాష్ట్రంలో ఈ నెల 30న ఎన్నికలు జరగనుండడంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సిలిండర్ ధరలను రూ. 400, రూ. 500లుగా ప్రకటించాయి. బిజెపి మాత్రం ఉజ్వల వినియోగదార్లకు మాత్ర మే ఏడాదికి 4 సిలిండర్లు ఉచితమని ప్రకటించింది. అయితే ఉజ్వ ల వినియోగదార్లు అతి పేదలు అతి తక్కువగా ఉండడంతో దీని ప్రభావం అంతగా లే దు. అసలు ప్రభావం కాంగ్రెస్ రూ. 500, బిఆర్‌ఎస్ రూ. 400 లు పైనే వుంది. డిసెంబర్ 3 న ఫలితాలు వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, ధరలు కూడా తగ్గుతాయని భావించిన వినియోగదార్లు ఈ నెలలో సిలిండర్ల బుకింగ్‌ను ఆపివేశారు. మహిళా ఓటర్లు మొత్తం ఓటర్లలో 50 శాతం పైగా ఉండడంతో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు సిలిండర్ ధరలను తగ్గిస్తామని లేదా ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి.

అధికార బిఆర్‌ఎస్ పార్టీ రూ. 400కే సిలిండర్ ఇస్తామని ప్రకటించగా, కాంగ్రెస్ కర్నాటకలో మాదిరిగా 500 రూపాయలకు ఇస్తామని ప్రకటించింది. బిజెపి మరో అడుగు ముందుకేసి ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఇళ్లలో వాడే సిలిండర్ ధర రూ. 955గా ఉంది. కొద్ది నెలల క్రితం దాకా సిలిండర్ ధర రూ. 1155. సిలిండర్ ధరలు రూ. 465 నుంచి రూ. 1155కు అంటే దాదాపుగా మూ డు రెట్లు పెరిగిన ఆ వేడి బిజెపి పై కర్నాటక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ ధరను మిగతా రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడడంతో అనివార్య పరిస్థితుల్లో 950 రూపాయలకు తగ్గించింది. కానీ ఈ ధర కూడా పేద మధ్యతరగతి ప్రజలకు భారంగానే ఉంది. 2014లో సిలిండర్ ధర 465 రూపాయలు గా ఉండేది. అప్పట్లో సిలిండర్ కొన్న తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ కింద 500 రూపాయల దాకా ప్రతి వినియోగదారుడి ఖాతాలో జమ అయ్యేది. ముందుగా వినియోగదారుడు రూ. 965 ఫోన్ పే చేసేవాడు.

కానీ బిజెపి ప్రభుత్వ హయాంలో సిలిండర్ ధర 1155 కు పెరిగి వినియోగదారుడికి 55 రూపాయల దాకా మాత్రమే అకౌంట్లో రిఫండ్ పడేది. ఇది అందరికీ భరించలేని భారంగా మారింది. దీన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో రూ. 500 కే సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. మిగతా అసలు ధరను ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తుందని ప్రకటించింది. దీంతో అక్కడ మహిళా ఓటర్లు కాంగ్రెస్‌కు పోలోమంటూ ఓట్లు వేశారు. ఇదే తరహాలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్ సిలిండర్ ధరను 500 రూపాయలుగా ప్రకటిస్తే బీఆర్‌ఎస్ 400 రూపాయలుగా అతి తక్కువగా ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే పేదలకు నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బిజెపి మేనిఫెస్టోలో చేర్చింది. కాని ఆ పార్టీ ఒక మెలిక పెట్టింది. ఉచిత సిలిండర్లు అందరికీ కాదని కేవలం ఉజ్వల లబ్ధిదారులకు మాత్రమేనని పేర్కొన్నది. ఈ మతలబు చాలా మందికి తెలియదు.

అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో సిలిండర్ ధర ప్రధానం కావడంతో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల తర్వాతబీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే రూపాయలు 400, కాంగ్రెస్ రూ. 500 కే సిలిండర్ ఇస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రభుత్వం తథ్యం, సిలిండర్ ధర తగ్గడం తథ్యమని తేలడంతో వినియోగదారులు సిలిండర్ల బుకింగ్‌ను నిలిపివేశారు. వచ్చే నెలలో సిలిండర్ ధరలు తగ్గడం ఖాయం కావడంతో ఇప్పుడు ఇండ్లలో సిలిండర్ ఎట్లాగూ ఒకటి స్పేర్‌లో ఉంటుంది. కాబట్టి డిసెంబర్ దాకా బుకింగ్‌లను నిలిపివేశారు. ఇప్పుడు బుక్ చేస్తే 955 దాకా చెల్లించాలి. అదే డిసెంబర్లో బుక్ చేస్తే రూ. 400 లేదా రూ. 500 చెల్లించాలి అనే భావనతో హైదరాబాద్ నగరంలో అంతటా బుకింగ్‌లు ఆగిపోయాయి.

హైదరాబాదులో మూడు రకాల గ్యాస్ కంపెనీలకు 120 మంది దాకా డీలర్లు ఉన్నారు. నవంబర్ నెలలో ప్రధాన పార్టీల మేనిఫెస్టో పుణ్యమా అని నగరం అంతట లక్ష దాకా సిలిండర్ల బుకింగ్‌లు ఆగిపోయాయని డీలర్లు లబోదిబోమంటున్నారు. నిజానికి ఇది చలికాలం సీజన్. ప్రతి ఏడాది ఈ నెలలో సిలిండర్ల వినియోగం 5 శాతం పెరుగుతుంది. ఈసారి ఎన్నికల పుణ్యమా అని ఐదు నుంచి పది శాతం దాకా బుకింగ్‌లు తగ్గిపోయాయి. డీలర్ల ప్రతినిధులు మన తెలంగాణ ప్రతినిధికి తెలియజేశారు. ఒక్కో ఏజెన్సీలో నవంబర్ నెలకు బుకింగ్‌లు 800 నుంచి 1200 దాకా గతంతో పోలిస్తే తగ్గిపోయాయని వారు చెపుతున్నారు. ఈ రకంగా ఒక జంట నగరాల్లోనే లక్ష బుకింగ్ ఆగిపోతే తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభావం ఎంత తీవ్రంగా వుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిట్టపల్లి శ్రీనివాస్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News