Monday, December 23, 2024

ఒకే ట్రాక్ పైకి మూడు రైళ్లు…. తప్పిన పెను ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినప్పటికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… సంబల్‌పూర్- రూర్కెలా మెము రైలు, రూర్కెలా-ఝుర్సుగూడ ప్యాసింజర్ రైలుకు వంద మీటర్ల దూరంలో ఒకే లైన్‌లో ఎదురెదురుగా వచ్చి ఆగిపోయాయి. మెము రైలుకు వెనుక రెండు వందల మీటర్ల దూరంలో పూరీ-రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగిపోయింది. రైల్వే సిగ్నలింగ్ పని చేయకపోవడంతోనే ఇది జరిగిందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. వంద భారత్ ఎక్స్‌ప్రెస్ అదే వేగంతో వచ్చి ఢీకొట్టే పెను ప్రమాదం జరిగేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News