Friday, December 20, 2024

‘యానిమల్’ ట్రైలర్ వచ్చేసింది.. రణబీర్ విశ్వరూపం..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’. ఇప్పటికే విడుదలైన టీజర్ తోపాటు పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తండ్రీ కొడుకుల చుట్టూ జరిగే కథగా రూపొందిన ఈ మూవీలో రణబీర్ కపూర్ విశ్వరూపం చూపించబోతున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.

భూషణ్ కుమార్,  క్రిషన్ కుమార్ టి సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పై ‘యానిమల్‌’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందనా హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 1, 2023న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక, ఈ మూవీ నిడివి ఏకంగా 3 గంటల 22 నిమిషాల 23 పెకన్లు ఉంది. ఇంత పెద్ద నిడివితో వస్తున్న ఈ మూవీ.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందా?.. లేక బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News