న్యూఢిల్లీ: నకిలీ జీరోధా ఉద్యోగుల మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆన్‌లైన్ బ్రోకింగ్ సంస్థ జీరోధా సిఇఒ, సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హెచ్చరించారు. కామత్ ఒక వీడియోను షేర్ చేసి, ఫేక్ వ్యక్తులు ఎలా మోసాలకు ప్రయత్నిస్తున్నారో చెప్పారు. ఓ వ్యక్తి నకిలీ జీరోధా ఉద్యోగిగా చూపిస్తూ రూ.5 కోట్లు మోసం చేసేందుకు యత్నించాడని తెలిపారు. అలాంటి క్లెయిమ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన జీరోధా ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు వస్తాయంటూ నకిలీ జీరోధా ఉద్యోగి క్లయింట్‌ను కలుసుకున్నాడు. అతనికి జెరోధా బ్యాంక్ ఖాతాల నకిలీ స్టేట్‌మెంట్‌లను చూపించాడు, అందులో రూ.10 కోట్లు ఉన్నాయి. అయితే క్లయింట్ జీరోధాను సంప్రదించాడు, నకిలీ వ్యక్తికి డబ్బు చెల్లించలేదు. ఇలాంటి క్లెయిమ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులందరినీ కంపెనీ కోరింది.
నకిలీ క్లోన్ యాప్‌లు
నకిలీ క్లోన్ యాప్‌ల సహాయంతో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల లాభ, నష్టాల ప్రకటనలు, లెడ్జర్‌లు, బ్యాంక్ ఖాతాల వీడియోలను రూపొందిస్తున్నా రు. ఈ వ్యక్తులు నకిలీ స్క్రీన్‌షాట్‌లతో పాటు వీడియోలను కూడా ఉపయోగిస్తున్నారని కామత్ పె ట్టుబడిదారులను హెచ్చరించారు. నకిలీ క్లోన్ యాప్‌లలో రూపొందించిన వీడియోల పట్ల జా గ్రత్తగా ఉండాలని కామత్ అన్నారు.
ధనిక అమెరికన్లు భారత్‌లో పెట్టుబడులు
చాలా మంది అమెరికన్ ఇన్వెస్టర్లు భారత్‌లో పె ట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నితిన్ కామత్ తెలిపారు. కానీ అమెరికా భవిష్యత్తును నిర్మించేందుకు భారతీయ యువత దేశాన్ని వది లి అక్కడికి వెళ్తున్నారని ఆయన అన్నారు.