విశాఖపట్నం: మెగా టోర్నీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమితో జట్టు ప్రధాన కోచ్ పదవిలో రాహుల్ ద్రవిడ్ కొనపాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రెండేళ్ల ఒప్పందం ముగియనుండటంతో ద్రవిడ్ పదవి కాలాన్ని పొడగించేందకు బిసిసిఐ విముఖత చూపుతున్నట్లు, ఈ పదవిలో ద్రవిడ్‌మ సయితం కొనసాగేందుకు నిరాశక్తిని చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్‌సిఎ డైరెక్టర్‌గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్‌ను నియమించేందుకు సన్నహాలు చేస్తునట్లు సమచారం. అయితే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ అనంతరం బిసిసిఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, సిరీస్‌కు వివిఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగాలన్న రాహుల్ ద్రవిడ్ నిర్ణయంలో ప్రధాన పాత్ర పోషించింది. అదే సమయంలో కోచ్ పదవిపై లక్ష్మణ్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ సమయంలో, లక్ష్మణ్ కూడా బీసీసీఐ ఉన్నతాధికారులను కలవడానికి అహ్మదాబాద్ వెళ్లారు. అతను టీమ్ ఇండియా కోచ్‌గా దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన నుండి అతను శాశ్వత కోచ్‌గా ఉంటాడు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కొత్త కోచింగ్ పాలనలో టీమ్‌ఇండియా ఏ దిశగా పయనిస్తుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ, ఉత్కంఠ నెలకొంది. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 డిసెంబర్ 10న జరగనుంది.