Sunday, January 19, 2025

భార్య మర్మావయవాలపై యాసిడ్ పోసి… దారుణం…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం నెలమంగళ ప్రాంతం కరుబనహళ్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్య తల్లిగారింటి నుంచి కట్నం తీసుకరాలేదని ఆమెపై భర్త దాడి చేసి సతీమణి మర్మావయవాలపై యాసిడ్ పోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మండ్యకు చెందిన సంతోష్, బాగులకుంటకు చెందిన కావ్యను పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి జరిగి ఆరు నెలల కావొస్తుంది. సంతోష్ మద్యానికి బానిసగా మారి ప్రతీ రోజు ఆమెను వేధిస్తున్నాడు. తన తల్లితో కలిసి ఆమెను రోజు రోజు వేధింపులకు పాల్పడుతున్నారు. భార్య కట్న తీసుకరాలేదని కోపంతో మరుగుదొడ్డి శుభ్రం చేసే యాసిడ్ ఆమెపై మర్మావయవాలపై పోసి అనంతరం పారిపోయాడు. ఆమె తన తల్లితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఆమె అత్త, భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News