Thursday, December 19, 2024

బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు

- Advertisement -
- Advertisement -

చెన్పూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ కటుంబంపై జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీపై జరిగినట్లే భావిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల వివేక్ నివాసాలు, కంపెనీలతోపాటు ఆయన కుటుంబ సభ్యులై ఐటీ, ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేక్ పై ఐటీ, ఈడీ దాడులను రేవంత్ రెడ్డి ఖండించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

“బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారు. రాజ్యాంగబద్ధం సంస్థలను మోదీ, కేసీఆర్ పావులుగా మార్చారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ.. ఐటి, ఈడీ దాడులు పెరుగుతున్నాయి. ప్రజల తరఫున పోరాడితే ద్రోహులా?. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్లు పవిత్రుల్లా?. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను ఈసీ కాపాడాలి” అని లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News