- Advertisement -
హైదరాబాద్: గత ప్రభుత్వంలో వైద్యరంగం ఎట్లుండే అని మంత్రి కెటిఆర్ అడిగారు. ఆటో యూనియన్ లీడర్లతో కెటిఆర్ సమావేశం నిర్వహించారు. 1025 గురుకుల పాఠశాలలు రాలేదా?, వ్యవసాయ రంగంలో మార్పులు రాలేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదని విమర్శించారు. లక్షా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
డీప్ ఫేక్‌పై బిఆర్‌ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్ అప్రమత్తంగా ఉండాలని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పోలింగ్ సమీపిస్తుండడంతో తన పేరు, వాయిస్‌తో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీలు వైరల్ చేస్తాయని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.
- Advertisement -