Monday, December 23, 2024

25 మంది బందీల విడుదల

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : పరస్పరం కుదిరిన సంధి మేరకు శుక్రవారం హమాస్ తమ వద్ద ఉన్న బందీలలో తొలివిడతగా 25 మందిని విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెలీలు, 12 మంది థాయ్ బందీలు ఉన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరపోరుకు ఈజిప్టు ఇతర దేశాల మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీని మేరకు నాలుగు రోజులు కాల్పులు , దాడులు నిలిపివేత ప్రక్రియ ఆరంభమైంది. హమాస్ చెరలో ఉన పౌరుల విడుదల ఇందుకు ముందస్తు షరతుగా ఉంది. రెండు నెలల చెరజీవితం తరువాత విడుదల అయ్యి స్వేచ్ఛగా బయటపడ్డారు.

తమ దేశానికి చెందిన 12 మంది విడుదల అయినట్లు థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఇజ్రాయెల్‌కు చెందిన వారిని హమాస్ ముందుగా ఈజిప్టుకు తరలించింది. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జైళ్లలో ఉ్న 39 మంది పాలస్తీనియన్ల విడుదలకు బదులుగా ఇజ్రాయోలీలను హమాస్ విడిచిపెట్టింది. ఇజ్రాయెలీలను హమాస్ వర్గాలు ముందుగా రెడ్ క్రాస్‌కు అప్పగించింది. వీరు ఇప్పుడు ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా పొలిమేరల్లో ఉన్నారు. ఈజిప్టుకు చేరుకుని వీరు తరువాత ఇజ్రాయెల్‌లోని తమ స్వస్థలాలకు చేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News