Monday, December 23, 2024

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం : రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కట్టంగూర్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని దానికి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వేముల వీరేశంకు మద్దతుగా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ నేతృత్వంలో నిర్వహించిన కాంగ్రెస్ భరోసా సభకు స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ మాజీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆనాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డితో కొట్లాడి ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ద్వారా ఈ ప్రాంతానికి 3 లక్షల 60 వేల ఎకరాలకు కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించారని ఆయన గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో నల్లమల్ల అడవులలో 32 కి.మీ దూరం టన్నెల్‌ను తవ్వారని 10 కి. మీ పూర్తి చేస్తే నల్లగొండ జిల్లా సస్యశామలం అయ్యేదని, ఈ ఫోర్లైడ్ బాధ తప్పుతుండేదని, ఈ ప్రాంత రైతుల కాలువల ద్వారా నీళ్లు వస్తుండేనన్నారు. ఎస్‌ఎల్‌బిసి పనులు పూర్తయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంచి పేరు వస్తదని, నల్లగొండ బాగుపడుతదని బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్షం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ రాష్టం ఏర్పాటు కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇందిరమ్మరాజ్యం తెచ్చే బాధ్యత నాదేనన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏవీ భర్తీ చేసినా ఉస్మానియా యూనివర్శిటీలో ఏ హాస్టల్‌లో చూసినా, హైదరాబాద్‌లో డిఎస్‌పిలు, సీఐలు, ఎస్‌ఐలు అయినా సింహభాగం మన నల్లగొండ జిల్లా యువకులే ఉంటారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ 12 స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీమ్‌ను అమలు చేస్తామని తెలిపారు. నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల వీరేశం చెయ్యి గుర్తు పై నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించేందుకు ఈ ఐదు రోజులు పాటు కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పని పని చేయాలన్నారు. సభాధ్యక్షులు, నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల వీరేశం సభాధక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి, రాష్ట్ర శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, బిసి ఫైనాన్స్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పూజర్ల శంభయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్‌నాయక్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండేటి మల్లయ్య,దైద రవీందర్, పటేల్ రమేష్‌రెడ్డి, దుబ్బాక నర్సింహ్మారెడ్డి, నకిరేకల్, కట్టంగూర్ ఎంపిపిలు బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్‌రావు, జెల్లా ముత్తి లింగయ్య,

ఉస్మానియా జెఏసి నాయకుడు చెనగోని దయాకర్ గౌడ్, కట్టంగూర్ మాజీ జడ్పీటిసి లు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ది యాదగిరి గౌడ్ లింగాల వెంకన్న గౌడ్, రెడ్డిపల్లి సాగర్, మహిళా కాంగ్రెస్ జిల్లా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News