Monday, December 23, 2024

కారు ఇంజిన్‌లో నోట్ల కట్టలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు తరలిపోతున్నాయి. ఎన్నికల సం ఘం, పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ విభాగా లు ఎంతగా నిఘా పెడుతున్నా ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడటం లేదు. వినూత్న రీతిలో అధికారుల కంటబడకుండా డబ్బు తరలించే కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో మరింతగా డబ్బులు ఆయా నియోజకవర్గాలకు తరలివెళ్లే అవకాశం లేకపోలేదు.

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 248 చెక్‌పోస్టుల ద్వారా ధన, ఇతరత్రా ప్రలోభాలను నిలువరించేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ డబ్బు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండటం గమనార్హం. తాజాగా ఓ పార్టీకి చెందిన నేత కూడా కారు ఇంజిన్‌లో డబ్బులు పెట్టి తరలిస్తున్నాడు. అయితే ఇంజిన్ వేడి కావడంతో డబ్బులకు మంటలు అంటుకున్నాయి. వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బోల్లికుంటలోని వా గ్దేవి కాలేజీ ముందు ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో నుంచి పొగలు వస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పి చూడగా,  కట్టల కొద్దీ డబ్బు కనిపించింది. దీంతో ఎవరికి వారు దొరికినంత సొమ్మును జేబుల్లో పెట్టుకుని పరిగెత్తారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ కారు ఎవరిదో తేల్చే పనిలో పడ్డారు. కారులో దాదాపు రూ. 25 లక్షలు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News