తెలంగాణ ఎన్నికల్లో ఎడ ఇన్న ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది అదే బర్రెలక్క. 26 ఏండ్ల కర్నే శిరీష నాగర్‌కర్నూల్‌లోని కొల్లాపూర్ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగింది. నిరుద్యోగుల సమస్యలతో పాటు ఇతర సమస్యలను లేవనెత్తుతూ సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బర్రెలక్క డిగ్రీ చదివినా ఉద్యోగం రాలేదని, అందుకే బర్రెలు కాస్తున్నానని గతంలో వీడియో రికార్డు చేసి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసింది. అంతే అదికాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అయింది.
ఆమెకు వాలంటీర్ల బృందం, తోటి విద్యార్థులు అండగా నిలబడ్డారు. ఆకర్షణీయమైన పాటల ద్వారా ఆమె ప్రచారానికి ఫుల్ సపోర్టు చేస్తున్నారు. అంతే కాకుండా పలువురు యూట్యూబర్‌లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. శిరీషకు యూట్యూబ్ లో 1.66, ఇన్ స్టాగ్రామ్ లో 5.97, ఫేస్ బుక్ లో 1.12 లక్షల మంది ఫాలో అవుతున్నారు. బర్రెలక్క తల్లిదండ్రులు పెద్దకొత్తపల్లిలో ఫాస్ట్ ఫుడ్ బండి నడుతున్నారు. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క కొల్లాపూర్ లో భారీ మెజార్టీతో గెలుస్తానని చెబుతోంది. అసలు బర్రెలక్క స్టార్ ఎలా తిరగబోతుందనే దాని కోసం ఎదురు చూడాల్సిందే.