Sunday, January 19, 2025

కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గత కొన్ని వారాలుగా తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన సందర్భంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎన్నికల సంఘం నుండి ఆయన నోటీసు అందుకున్నారు. గతంలో బిఆర్‌ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి గురించి కెసిఆర్ వ్యాఖ్యానిస్తూ “ఇది అరాచకం. ఎంపీని కత్తితో ఎలా పొడిచారు? మన దగ్గర కూడా పదునైన కత్తులు ఉన్నాయని వారికి తెలియదా. ఇది మాకు ఎంత కష్టంగా ఉంటుంది” అని తెలిపారు.

వికాస్ అనే కాంగ్రెస్ నాయకుడి ఫిర్యాదుపై కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యను ఈసీ గమనించింది. దీంతో వివరణ ఇవ్వాలని కోరుతూ కేసీఆర్‌కు నోటీసులు పంపారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఘటనను ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రజల మధ్య గొడవలు, రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అక్టోబర్ 30న తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఇప్పుడు కెసిఆర్‌ను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News