Monday, December 23, 2024

తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం: మోడీ

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. బీఆర్ఎస్ సర్కార్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని…కేసీఆర్ హయాంలో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(నవంబర్ 25) కామారెడ్డిలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీజేపీ చెప్పిందే చేసి చూపిస్తుందని, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట తప్పమని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ అప్పులకుప్పగా చేసిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక్కటేనన్నారు. పథకాలన్నీ బీఆర్ఎస్ కు ఏటిఎంలా మారాయని.. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీజరిగిందని అన్నారు మోడీ. పేపర్ లీక్ తో విద్యార్తుల జీవితాలను ఆగం చేశారని చెప్పారు.

రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరిగిందని, దళిత ఉఖ్యమంత్రి హామీ ఏమైంది? అని నిలదీశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే మా లక్ష్యం. 370 ఆర్టికల్, మహిళా బిల్లు విషయంలో మాట నిలబెట్టకున్నాం. బీసీలు, దళితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని, బీఆర్ఎస్ సర్కార్ దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News