Monday, December 23, 2024

కాంగ్రెస్ గెలవకుండా కుట్ర చేస్తున్నారు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీకి కేసీఆర్, ఓవైసీ ఇద్దరూ చీకటి మిత్రులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దుతోపాటు అన్ని విధాలుగా బీజేపీకి బీఆర్‌ఎస్ సహకరిస్తుందని.. అందుకే కేసీఆర్‌కు మోడీ సాయం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ను, ఢిల్లీలో మోడీని ఓడగొడతామన్నారు. బుధవారం నిజామాబాద్ లో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించారు.

తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉండాలని మోడీ అనుకుంటున్నారని.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ గెలువకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలకు భూములు అప్పగిస్తున్నారని.. తెలంగాణ మంత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని చెప్పారు. ధరణి తెలంగాణలో దొరలు మీ భూములు లాక్కుంటున్నారని, రాష్ట్రంలో ఇప్పటవరవకు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారని చెప్పారు.తెలంగాణలో దొరల పాలన కొనసాగుతుందని.. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజల తెలంగాణ వస్తుందని రాహుల్ గాందీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News