Sunday, January 19, 2025

‘తేజస్’ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ శనివారం బెంగళూరు లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో విహరించారు. ఆ ఫోటోలను ప్రధాని తన ఎక్స్‌ఖాతాలో పంచుకున్నారు. “తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాను. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంతో మన స్వదేశీ సామర్థంపై నా విశ్వాసం మరింత పెంచింది. మనదేశ శక్తి సామర్థాల పట్ల నాకు గర్వంగా ఉంది. ఇది మన శాస్త్రవేత్తల కృషి, అంకిత భావానికి నిదర్శనం. స్వావలంబనలో మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాబోమని నేను గర్వంగా చెప్పగలను. భారత వాయుసేన, డీఆర్‌డీవో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్)కు హృదయపూర్వక అభినందనలు” అని మోడీ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా హల్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తయారీ యూనిట్‌ను ప్రధాని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News