హైదరాబాద్: మసీదుకు ప్రార్థనల కోసం వచ్చే వారి ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్న యువకుడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, ముసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్ నదీం సిసిటివి టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు తన అవసరాలకు సరిపోకపోవడంతో ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నాడు.
మసీదుకు నమాజ్‌కు వచ్చే వారిని టార్గెట్‌గా చేసుకుని చోరీ చేస్తున్నాడు. నమాజ్‌కు వచ్చే వారు ల్యాప్‌టాప్‌లను పెట్టగానే వాటిని చోరీ చేసి పారిపోయేవాడు. వాటిని విక్రయించి డబ్బులు తీసుకునేవాడు. నిందితుడు అఫ్జల్‌గంజ్, చాంద్రాయణగుట్ట, చాదర్‌ఘాట్, ఖైరతాబాద్, అబిడ్స్, ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ నరేష్, ఎస్సైలు అరవింద్ గౌడ్, నాగరాజు తదితరులు పట్టుకున్నారు.