Monday, December 23, 2024

ఉప్పల్ ఉస్తాద్ ఎవరో?

- Advertisement -
- Advertisement -

(పి.మహేష్‌కుమార్/ మనతెలంగాణ)
ఎన్నికల ప్రకటనకు ముందు ఓలెక్క.. తర్వాత ఓ లెక్క అన్నట్లుగా ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల తీరు.. ప్రత్యర్థులంతా ఒకేచోటుకి చేరారు. ప్రతిపక్షాలను ఒడించేందుకు గులాబీ అభ్యర్థి వ్యూహాలు ఫలించాయి.. అగ్రనేతల ప్రచారంతో బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు జోష్‌తో ఉన్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఉప్పల్, మల్లాపూర్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లకా్ష్మరెడ్డిని గెలిపించాలని కోరుతూ రోడ్‌షో నిర్వహించారు. అంతకముందు మంత్రి హరీష్‌రావు సైతం కార్యకర్తల సభకు హజరై గెలుపుకు పదునైనా వ్యూహాలు చేసి వెళ్లారు. మరోవైపు భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ గెలుపు కోసం ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షానే నేరుగా రంగంలోకి దిగారు. నాచారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసి కమలం గుర్తుకు ఓటేసి గెలపించాలని కోరారు.

ఒక్కడిగానే ‘హస్తం’ అభ్యర్థి పోరాటం…
పోలింగ్‌కు వారం రోజులే ఉంది. ప్రచారానికి నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలింది. కానీ ఇప్పటి వరకు ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందుమల పరమేశ్వరరెడ్డి ప్రచారానికి కాంగ్రె స్ పార్టీ అగ్రనేతలు ఎవరూ రాలేదు. ఒక్కడిగానే పార్టీ ప్రచారం చేసుకుంటా వెళ్తున్నారు. ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న సతీమణి మందుమల రజితా పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఉప్పల్ సర్కిల్‌లోని నాలుగు డివిజన్ల చిల్కానగర్, ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడలో భార్య రజితా విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి సైనిక్‌పురికి మాకాం మార్చి కాప్రా సర్కిల్ పరిధిలో ఆరు డివిజన్లలో అర్థరాత్రి వరకు కాలనీ పెద్దలను కలుసుకుంటూ ఓటర్లును ప్రభావితం చేస్తున్నారు. ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రధాన అనుచరులు బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్ గూటికి చేరడంతో బలంగా మారింది. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్యనే బలమైన పోటీగా మారింది. త్రిముఖ పోరుగా ఉన్న ఉప్పల్ గడిచిన నాలుగు రోజులుగా ప్రధానంగా కాంగ్రెస్‌బీఆర్‌ఎస్ పార్టీల మధ్యనే పోటీ ఉండబోతుందని ప్రచారం సాగుతుంది.

కమలం భారంగా నెట్టుకొస్తుందిలా…
ప్రధాన పార్టీల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీపడి ఖర్చులకు వెనకడుగు వేయకుండా ప్రచారంలో దూసుకపోతున్నారు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి, మరోసారి అసెంబ్లీ అధ్యక్షా అనేందుకు పోటీపడుతున్న కమలం పార్టీ ప్రచారం వెనకడుగులో ఉంది. శక్తికేంద్రాల పేరుతో కార్యకర్తల చేస్తున్న ప్రచారానికి అభ్యర్థి సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉప్పల్ ప్లైఒవర్ నిర్మాణం ఏళ్ల తరబడి తాత్సరం చేస్తున్న కమలం పార్టీపై ప్రజలు వ్యతిరేఖత చూపిస్తున్నారు. అభ్యర్థి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేఖతను ప్రధాన ప్రచారం అస్త్రంగా వాడుకుంటున్నారు. అవినీతిరహిత పాలన చేస్తున్నారే తప్ప స్పష్టమైన హమీలు ప్రకటనలో పూర్తిగా విఫలం చెందారు.

తొలిసారి పోటీపడే వారికే అదృష్టం..?
అసెంబ్లీ అడుగుపెట్టబోతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లకా్ష్మరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మందుమల పరమేశ్వరరెడ్డిల మధ్య పోటీ ఉండబోతుంది. వీరిద్దరిలో ఒకరికి అధ్యక్షా అనేందుకు అదృష్టం వరించబోతుందనే ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఉప్పల్ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసే అభ్యర్థే గెలుస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగా 2014లో కాంగ్రెస్ తరుపున బండారి లకా్ష్మరెడ్డి పోటీచేసి ఇప్పటి బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేతిలో ఒడిపోయారు. తర్వాత రాజకీయ సమీకరణల్లో భాగంగా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక కాంగ్రెస్ నుంచి పరమేశ్వరరెడ్డి తొలిసారి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరి మధ్యే బలమైన పోటీతోపాటు ఇప్పటికే బెట్టింగ్ సైతం పెద్దఎత్తున చేస్తున్నారు. కాలనీలో ప్రజలకు అవసరమైన పనుల కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన హమీలు ఇస్తూ ఓటర్లు మనస్సులు గెలిచేందుకు పోటీపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News