Monday, December 23, 2024

రైతు బంధు పంపిణీతో బిఆర్‌ఎస్ వైపు జనం మొగ్గు: ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆఘమేఘాల మీద రైతు బంధు పంపిణీకి అనుమతి ఇవ్వడంతో అధికార బిఆర్‌ఎస్ వైపు రైతులు మొగ్గు చూపుతారని బిఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ఓటింగ్‌కు రెండు రోజుల ముందు బంధు సాయం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఓటర్లను ప్రభావితం చేయడమేనని, 2018 లో కూడా ఇదే జరిగిందదన్నారు.

డిసెంబర్‌లో విడుదల కావాల్సిన రైతు బంధు ఆకస్మాత్తుగా నవంబర్‌లో ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం నవంబర్‌లోనే రైతు బంధు సాయం విడుదలకు ఈసికి బిఆర్‌ఎస్ లేఖ రాయడం వారికి అనుకూలంగా ఉంటుందన్నారు. రుణమాఫీ నిధులు, ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన డిఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు బ్రేక్ వేసిందని, వారేం పాపం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News