Thursday, September 19, 2024

టీమిండియాకు రెండో విజయం..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 20 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 25 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు.

మరో ఓపెనర్ రుతురాజ్ 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 58 పరుగులు సాధించాడు. ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన రింకు సింగ్ 9 బంతుల్లోనే 4ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు చేసి పరాజయం పాలైంది. స్టోయినిస్ (45), టిమ్ డేవిడ్ (37), కెప్టెన్ మాథ్యూ వేడ్ 42 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News