Monday, December 23, 2024

సైకిల్ ను ఢీకొట్టిన బైక్..9ఏళ్ల బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలో ఆదివారం అర్థరాత్రి సైకిల్ పై ఇద్దరు బాలురు రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం అదుపుతప్పి సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్ముడు రాకేశ్(9) మృతి చెందగా.. అన్న సిద్ధు(11)కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన బాలుడిని స్థానికులు చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని నిందిడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News