- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు బిజెపిని ఎందుకు ప్రశ్నించడంలేదని ఎంఎల్‌సి కవిత ప్రశ్నించారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ నిధులకు కేంద్రం భారీగా కోతలు విధించిందని దుయ్యబట్టారు. పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాత్రమే మోడీ సాయం చేశారని, కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారులకే రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదని, బిఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఎంఎల్‌సి కవిత హామీలిచ్చారు. కులమతాల పేరుతో కొన్ని పార్టీలు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ కావాలో మైగ్రేషన్ కావాల్లో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. రైతుబంధు కావాల్లో రాబందులు కావాలో ఆలోచించుకోవాలని, కాంగ్రెస్ నేతలు కావాలనే రైతుబంధు రాకుండా ఆపారని కవిత విమర్శించారు.
- Advertisement -