Friday, December 20, 2024

కాంగ్రెస్ వల్లే.. ఈసీ రైతుబంధును ఆపింది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతుబంధును ఆపిందని హరీష్ రావు అన్నారు. రైతుబంధు ఇచ్చేందుకు మూడు రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చిందని.. కానీ, యాసంగికి రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ మళ్లీ రైతుబందును ఆపిందని హరీశ్ రావు ఆరోపించారు.రైతుబంధు మీద కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్ గెలిస్తే.. రైతుబంధు ఖతం అవుతుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హరీశ్ రావు కోరారు.

రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చిన ఈసీ సోమవారం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. హరీశ్ రావు ఎన్నికల ప్రచార సభల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించారని.. దీంతో రైతుబంధు నిధుల విడుదలకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఈసీ నిర్ణయంతో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News