- Advertisement -
హైదరాబాద్ లో రెండు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. సోమవారం… నవంబర్ 27వ తేదీ సాయంత్రం 4.30 గంటలనుంచి 6.30 వరకూ రెండు గంటల సేపు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మోడీ సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో రోడ్ షో లో పాల్గొంటారు. ముషీరాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకుత్ పురా, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, ఎల్బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి తదితర ప్రాంతాలలో ప్రధాని రోడ్ షో జరుగుతుంది.
- Advertisement -