Friday, December 20, 2024

పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల సమీపంలో 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రిభువనగిరి జిల్లా పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల దూరంలో ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుమ్మిగూడవద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News