Friday, December 20, 2024

చెన్నైలో విపిసింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్టాలిన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెన్నై లోని ప్రెసెడెన్సీ కాలేజీ ఆవరణలో ప్రతిష్ఠించిన దివంగత మాజీ ప్రధాని విపిసింగ్ విగ్రహాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం ఆవిష్కరించారు. సమాజ్‌వాదీ నేత, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తోపాటు విపిసింగ్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టాలిన్, యాదవ్, తదితరులు విపిసింగ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తమిళనాడు ప్రభుత్వం మాజీ ప్రధాని విపిసింగ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుందని స్టాలిన్ గత ఏప్రిల్‌లో ప్రకటించారు. బిపి మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఒబిసి) 27 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మాజీ ప్రధాని విపిసింగ్‌కే దక్కిందని స్టాలిన్ గుర్తు చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News