Monday, November 25, 2024

పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేతకు న్యూజిలాండ్ సంసిద్ధత

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్ : పొగాకు రహిత దేశంగా న్యూజిలాండ్ ప్రభుత్వం గతంలో పొగాకు ఉతత్తులపై విధించిన నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేయడానికి సంసిద్ధమైంది.నూతన ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం న్యూజిలాండ్ 42 వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలనే లక్షంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించారు. గతంలో న్యూజిలాండ్‌ను పొగాకు రహిత దేశంగా మార్చడానికి మాజీ ప్రధాని జెస్సిండా ఆర్డెర్న్ పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించారు. 2008 తరువాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని నిషేధం విధించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ వర్గాలతోపాటు న్యాయవాదులు కూడా స్వాగతించారు. ఇప్పుడు ఈ నిషేధాన్ని కొత్త ప్రధాని క్రిష్టోఫర్ తొలగించడానికి సిద్ధమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News