Wednesday, November 27, 2024

అంబర్‌పేటకు మెట్రో తెస్తాం

- Advertisement -
- Advertisement -

అంబర్‌పేట: హైదరాబాద్ అందరికీ. అమ్మ లాంటిది కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాదులో ఎలాంటి కర్ఫ్యూలు, మత ఘర్షణలు, కుల పంచాయతీలు లేవని, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకునే బాధ్యత బి ఆర్‌ఎస్ ప్రభుత్వం మీద ఉంటుందని బి ఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం అంబర్ పేట అలీ కేఫ్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మా ట్లాడుతూ.. తెల ంగాణ రాష్ట్రం వచ్చాక కరెంటు కష్టాలు, మంచినీటి కష్టాలు పోయాయని మళ్లీ మేమే గెలుస్తామని అప్పుడు ప్రతిరోజు మంచినీళ్లు సరఫరా ఉంటుందని ఆయన అన్నారు. ఓట మి భయంతోనే కిషన్ రెడ్డి పోటీ చేయకుండా తప్పించుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు వరదలు వచ్చినప్పుడు నగరానికి ఎలాంటి సాయం చేయని పనికిరాని మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ భోగిలో 15 మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారు.

మరోపక్క కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ,పియ్రగాంధీ ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేస్తారు. ఒక కేసీఆర్ ను ఓడించడానికి గొంతు నొకడానికి వస్తున్నారు. మేము ఎవ్వరికి భయపడే సమస్య లేదని సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుందని గుంపులు గుంపులుగా ఎవరు వస్తారు ప్రజలే చెప్పాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలు బరాబర్ కెసిఆర్ ని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ 18 సంవత్సరాలు నిం డిన ఆడపిల్లలకు, కోడళ్ళు సౌభాగ్య లక్ష్మితో పథకంతో నెలకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి మీద కాలేరు వెంకటేశ విజయం సాధించారు. అప్పటినుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. గత ఎన్నికల్లో ముస్లింలకు సోదరులకు స్మశాన వాటికకు స్థలము కేటాయిస్తామని కాలేరు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారము ముస్లిం సోదరులకు స్థలము కేటాయించమన్నారు. అంబర్ పేట ప్రజలకు నాలుగు వరాలు ఇస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఒకటిది అంబర్‌పేటకు మెట్రో వస్తుందని, రెండవది మూ సీ పరివాహక ప్రాంతాన్ని సుందరీ కారణంగా తీర్చిదిద్దానని,

మూడవది హిందువులకు, మైనార్టీలకు స్మశానక వాటిక స్థలం కేటాయిస్తామని, నాలుగోది అన్ని వర్గాల ప్రజలకు రేషన్‌షాప్ మీద సన్నబియ్యం, రూ,400 కి గ్యాస్ సిలిండర్లు, 5 లక్షల కేసీఆర్ బీమా ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇవన్నీ కావాలంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రావాలి.. అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బి. పద్మ వెంకటరెడ్డి, విజయకుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ పద్మ డిపి రెడ్డి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News