Saturday, November 23, 2024

పాక్‌లో ఛాంపియన్ ట్రోఫీ కష్టమే!

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : పాకిస్థాన్‌కు ఐసిసి మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాక్‌కు మరోసారీ మొడీ చేయి చూపింది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరగనుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం అనుమానంగానే కనిపిస్తుంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌కు భారత జట్టును పంపేందుకు బిసిసిఐ సుముఖంగా లేదు. అదే బాటలో భారత్‌తో పాటు మరికొన్ని జట్లు సయితం పాక్‌లో ఆడేందుకు నిరాకరిస్తున్నాయని ఈ నేపథ్యంలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫిని దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసిసి సూచనప్రాయంగానే అంగీకారం తెలిపింది. నిర్వహణ హక్కులను సంబంధించి ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని తెలుస్తోంది. అయితే.. పాకిస్థాన్ మాత్రం వెంటనే నిర్వహణ హక్కులను సంబంధించిన అగ్రిమెంట్ చేసుకోవాలని ఐసిసిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతుంది. భారత్.. పాక్‌లో ఆడేందుకు నిరాకరిస్తే మాత్రం తమకు పరిహారం చెల్లించాలని అంటోంది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించడంపై చర్చించేందుకు ఐసిసి ఎగ్జిక్యూటివ్ బోర్డుతో పిసిబి ఛైర్మన్ జకా అష్రఫ్, సీఓఓ సల్మాన్ నసీర్ సమావేశమయ్యారు. టీమ్‌ఇండియా పాక్‌కు రానంటే ఏ చేయాలన్న దానిపై వీరు చర్చించారు. ఇక ఎలాంటి పరిస్థితిలోనైనా ఐసీసీ టోర్నమెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని పీసీబీ కోరింది. గత రెండు సంవత్సరాల కాలంలో అనేక జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాయని ఈ సందర్భంగా పిసిబి గుర్తు చేసింది. గత ఆగస్టులో జరిగిన ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే.. భారత జట్టును పాక్‌కు పంపేందుకు భారత దేశ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భారత్ ఆడే అన్ని మ్యాచులను శ్రీలంక వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత దేశంలో ఆడేందుకు మొదట పాకిస్థాన్ నిరాకరించింది. అయితే తరువాత జరిగిన పరిణాల నేపథ్యంలో ఆ జట్టు మెట్టు దిగిరాక తప్పలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ హక్కులు సయితపాకిస్థాన్ చేజారిపోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ అభిమానులు పిసిబిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News