Saturday, December 21, 2024

అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తాం

- Advertisement -
- Advertisement -

సామాజిక న్యాయం మాతోనే సాధ్యం

బిజెపి రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మాకే పట్టం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో/మహబూబాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాలలో డిజిల్, పెట్రోల్ తక్కువగా ఉన్నాయని తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే ఇక్కడ కూడా రేట్లు తగ్గిస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సామాజిక న్యా యం బిజెపితోనే సాధ్యం అని ప్రధాని మోడీ అ న్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగం గా కరీంనగర్‌లో బండి సంజయ్ కుమార్ అధ్వర్యంలో నిర్వహించిన సకల జనుల విజయ సంక ల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. నా తెలంగా ణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు అంటూ తెలుగులో చెప్పారు. మొదట వేములవాడ రాజన్నను మోడీ స్మరించుకున్నారు. అలాగే శాతవాహన, కాకతీయులు, మౌర్యుల కర్మభూమి అయిన ఈ గడ్డకు నమస్కారాలు అంటూ కరీంనగర్ చరిత్రను గర్తు చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ సంజయ్ సూపర్ ఫాస్ట్ అని మీరు కూడా ఆయన అందుకోవాలంటూ కరీంనగర్ ప్రజలకు సూచించారు. కరీంనగర్‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నికలో కెసిఆర్‌కు ట్రైలర్ చూపించామన్నారు. తెలంగాణలో బిజె పి ప్రభుత్వం ఏర్పాటు కానుందని జోష్యం చెప్పారు. బిజెపి ప్రభుత్వంలో తొలి సిఎం బిసి వర్గం నుంచే ఉంటారని బిజెపి హామీ ఇస్తుందని అన్నారు. వచ్చే 5 సంవత్సరాలు తెలంగాణ ప్రగతి కోసం చాలా ముఖ్యమైనవన్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రయోగం చేయలేం… పొరబాటు చేయలేం…తెలంగాణను దాని అదృష్టానికి దానిని వదలలేం…అందుకే తెలంగాణకు బిజెపి ప్రభుత్వం చాలా అవసరం అన్నారు.

కాంగ్రెస్ సభ్యులకు గ్యారెంటీ లేని వాళ్లు ఎప్పుడైనా బిఆర్‌ఎస్‌లో చేరుతారని ఆరోపించారు. ఈ గడ్డ పి.వి. నరసింహా రా వు లాంటి వ్యక్తిని అందించిందని, అతన్ని కాం గ్రెస్ తీవ్రంగా అవమానించిందని, చనిపోయిన తర్వాత కూడా పివిని అవమానించిదందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని అన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాంబు పేలుళ్లు జరిగాయి అన్నారు. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ వంటి దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో కరీంనగర్ లో నక్సల్స్ హింస చెలరేగిందని అన్నారు. బిజెపి ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందనని అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్నారు.

తెలంగాణలో బిసి ముఖ్యమంత్రిని చేసి తీరుతాం : మోడీ
తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే అని కాబోయేది బిసి వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి చేపట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ను దరిరానివ్వద్దని, కాంగ్రెస్ నాయకులు అయోమయాన్ని సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

బిజెపిపై విశ్వాసం పెంచుకోవాలని మాట ఇస్తే తాము తప్పబోమని స్పష్టం చేశారు. మోడీ గ్యారెంటీ అంటే పూర్తి అయ్యే గ్యారెంటీ అని స్పష్టం చేశారు. మేడారం జాతరన ప్రపంచానికి ప్రచారం చేయనున్నామన్నారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసినట్ల్లు ప్రకటించారు. ఎస్సీల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని అందుకోసం కమిటీని కూడా వేశామన్నారు. చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. పిఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా రైతులకు సాయం అందిస్తున్నామని వివరించారు. సామాజిక న్యాయం, అభివృద్ధ్ది, సంక్షేమ అన్ని విధాలుగా సమంగా అందాలంటే ఈ ఎన్నికల్లో బిజెపి ఆధ్వర్యంలోని డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సభలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాల్లో బిజెపి తరుపున బరిలో నిలిచిన అభ్యర్థులు జాటోతు హుస్సేన్‌నాయక్, భూక్య సంగీత, ధరావత్ రవీంద్రనాయక్, కంభంపాటి పుల్లారావు, ప్రహ్లాద్, పొడియం బాలరాజు, కుంజా ధర్మారావు, ఇతర నాయకులు గరికపాటి మోహన్‌రావు, వి. రాజ్యవర్ధన్ రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, వద్దిరాజు రాంచందర్ రావు, మార్తినేని ధర్మారావు, ప్రభాకర్‌రెడ్డ, యాప సీతయ్య, సిద్దార్థరెడ్డి, సుధీర్‌రెడ్డి, ఇందుభారతి, దారా వెంకటేశ్వర్‌రావు, బోయినపల్లి లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News