Saturday, December 21, 2024

పెళ్లిపీటలెక్కబోతున్న దండుపాళ్యం హీరోయిన్!

- Advertisement -
- Advertisement -

దండుపాళ్యం ఫేం హీరోయిన్ పూజా గాంధీ పెళ్లిపీటలెక్కబోతోంది. నవంబర్ 29న బెంగుళూరులో విజయ్ అనే వ్యక్తిని 40 ఏళ్ల పూజా గాంధీ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.. కానీ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

బెంగాలీ అమ్మాయి అయిన పూజా.. సినిమాల్లో నటించేందుకు 2001లో బెంగళూరుకు వచ్చింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా పూజకు ఓ లాజిస్టిక్స్ కంపెనీకి యజమాని అయిన విజయ్ తో పరిచయం ఏర్పిందట. భాష తెలియక కన్నడ సినిమాల్లో నటించేందుకు ఇబ్బంది పడ్డ పూజాకు విజయ్ స్వయంగా కన్నడ భాష నేర్పించాడట. అప్పటి నుంచి స్నేహితులుగా కొనసాగుతున్న వీరిద్దరూ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తా వైరల్ అవుతోంది. ఇక, పూజా విషయానికి వస్తే.. కన్నడలో పలు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ దండుపాళ్యం సినిమాలో నటించిన పూజాకు మంచి గుర్తింపు లభించింది.
కాగా, 2012లో ఒక వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగిన తర్వాత… కొన్ని రోజులకే పూజా గాంధీ అతడితో బ్రేకప్ చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News