Friday, December 20, 2024

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీం బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రి, డీఎంకె నేత వీ సెంథిల్ బాలాజీకి సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. క్యాష్ ఫర్ జాబ్స్‌కు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో మంత్రి బాలాజీ అరెస్టయిన సంగతి తెలిసిందే. బాలాజీ ఆరోగ్యం గురించి గూగుల్‌లో వెతకగా ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని గ్రహించామని , అందుకే ఆరోగ్య కారణాలపై బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. బేలా ఎం. త్రివేదీ, సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ చెక్ చేయగా, దాన్ని క్యూర్ చేయలేమని ఉందని జస్టిస్‌త్రివేదీ తెలియజేశారు.

అయితే రెగ్యులర్ బెయిల్ కోసం మంత్రి బాలాజీ దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. తమిళనాడు రోడ్డు రవాణాశాఖలో బస్సు కండక్టర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన ఆరోపణలపై మంత్రి బాలాజీ జూన్ 14న అరెస్ట్ అయ్యారు. ఈడీ అరెస్ట్ చేసిన తరువాత ఆయన తన ఛాతీలో నొప్పి ఉన్నట్టు ఫిర్యాదు చేయడంతో ఆయనను రాష్ట్ర దవాఖానాలో చేర్పించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ తరువాత జైలుకు తరలించారు. మెడికల్ గ్రౌండ్స్‌పై బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News