- Advertisement -
మనతెలంగాణ, సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఐదుగురి కంటే మించి ఎక్కడైనా గుమ్మిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -