Monday, December 23, 2024

మంత్రి మల్లారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

విద్యాహర్హతల పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

మన తెలంగాణ / హైదరాబాద్: ఎన్నికల ముందు సుప్రీం కోర్టులో మంత్రి మల్లారెడ్డికి ఊరట లభించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా మల్లారెడ్డిని నిలువరించాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. మూడు అవిడవిట్లలో మూడు విధాలుగా తన విద్యార్హతల పిటీషన్‌ను పొందుపరిచారనే తమ అభ్యంతరాలను తెలియచేసినా రిటర్నింగ్ అధికారి పట్టించు కోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. హై కోర్టు ముందుకు వెళ్ళినా కూడా హైకోర్టు  ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదని, పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రిట్ పిటీషన్ దాఖలు చేసే అర్హత పిటీషనర్ అంజయ్‌ రెడ్డికి లేదని ధర్మాసనం పేర్కొంది. మల్లారెడ్డి తరపున న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అల్లంకి రమేశ్ తమ వాదనలు వినిపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News