Monday, December 23, 2024

బిజెపి చెప్పిన చోటే మజ్లిస్ పోటీ

- Advertisement -
- Advertisement -

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బిజెపి విధానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బిజెపి విధానమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్ జోడో యాత్ర సమయంలో చూశానని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీని ప్రశ్నించినందుకు తనపై 24 కేసులు పెట్టారని, ఢిల్లీలో ఎంపిల నివాసం నుంచి తనను వెళ్లగొట్టారని ఆయన గుర్తు చేశారు. ఎంపి నివాసం నుంచి తనను వెళ్లగొట్టినా బాధపడలేదని, దేశ ప్రజల గుండెల్లో తనకు ఇల్లు ఉందని.. బయటకు వచ్చానని ఆయన అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమని రాహుల్ తెలిపారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చింది తమ పార్టీ అని, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేసింది హస్తం పార్టీ అని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే ఇస్తామని.. రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న రాహుల్, మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2500లు వేస్తామని హామీనిచ్చారు.

బిజెపి ఎక్కడ చెబితే అక్కడ ఎంఐఎం పోటీ
ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుందని రాహుల్ ఆరోపించారు. బిజెపి చెప్పిన చోటే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. బిజెపి బిసి వ్యక్తిని సిఎం చేస్తామంటోందని ముందు ఆపార్టీ 2 శాతం ఓట్లు తెచ్చుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News