Monday, December 23, 2024

కెసిఆర్ చేసిన అభివృద్ధికి ఓటు వేయండి !

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ముందు గడచిన 58 ఏండ్లలో జరిగిన పనులు దిగదుడుపేనని స్పష్టమవుతున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ రంగం.. ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ అనేక విజయాలను నమోదు చేసిందని పేర్కొంటూ ఆయా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించిన మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

సిఎం కెసిఆర్ నేతృత్వంలో సాధించిన విజయాలతో తెలంగాణ ప్రజానీకం వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌కే జై కొడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధికి ఓటెయ్యండి… కారు గుర్తుకు ఓటెయ్యండి అని కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో 11 దఫాలు కాంగ్రెస్, టిడిపి పాలనలో జరిగిన పనులు, రెండు దఫాల్లో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఫలితంగా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాక.., సిర్పూర్ నుంచి అలంపూర్ దాక, భద్రాచలం నుంచి జహీరాబాద్ దాక, తాండూరు నుంచి చెన్నూర్ దాక, మధిర నుంచి ముధోల్ దాక, మక్తల్ నుంచి జుక్కల్ దాక, తెలంగాణ అంతటా కారు జోరు కొనసాగుతున్నదని, మళ్లీ కెసిఆర్ సర్కారే రానున్నదని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో గతంలో జరిగిన పనులు, గడచిన తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతితోపాటు వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కొత్త పథకాలను కెటిఆర్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News