Thursday, December 19, 2024

ఊపేస్తున్న ‘దేఖ్‌లేంగే’!

- Advertisement -
- Advertisement -

పాటల రూపంలో పదేళ్ల ప్రగతి,  ఆడి, పాడిన యువత

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘దేఖ్‌లేంగే’ అంటూ టి హబ్ వద్ద యువత స్టెప్పులు వేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరోసారి కెసిఆర్ అధికారంలోకి రావాలంటూ వారు వేసిన స్టెప్పులు ప్రజలను, ఐటీ ఉద్యోగులను, ఇప్పటి యువతను ఆలోచింప చేసేలా ఉన్నాయని సోషల్‌మీడియా వేదికగా పలువురు చర్చించుకుంటున్నారు. ఓట్ ఫర్ కెసిఆర్ అంటూ ముగ్గురు యువతీ, యువకులు ఆట, పాట రూపంలో ఆడిపాడడం చూసే వారిని మంత్రముగ్ధులను చేసింది.

‘తెలంగాణ వస్తే ఏం వస్తది, ఏంవస్తది అంటివి, తెలంగాణ వస్తే చీకటయితది అంటివి, గడియ కూడిన పోనీ కరెంట్ వచ్చినది, మోచేతి లోతులోనే నీళ్లొచ్చినది చూసినవా, చూద్దామా, వస్తవా, దేఖ్‌లేంగే’ అంటూ ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి వేసిన స్టెప్పులు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ‘పల్లెల్లో రైతన్నల సంబురాలు చూడరా, పట్నంలో రాలుతుంది పెట్టుబడుల జాతర, రాసుకోరా బిడ్డా, ఇది కెసిఆర్ అడ్డా’ అంటూ చివరగా పాడిన పదాలు 10 ఏళ్ల ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నట్టుగా ఉన్నాయని సోషల్‌మీడియా వేదికగా ఐటీ ఉద్యోగులు, యువత చర్చించుకుంటున్నారు. ఇలా పదేళ్ల ప్రగతిని పాటల రూపంలో ఇప్పటి యువతకు అర్ధం అయ్యేటట్టు చెప్పడం బాగుందని పలువురు కితాబునిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News