Saturday, December 21, 2024

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
ధర్మపురి ప్రచారంలో మహారాష్ట్ర సిఎం ఏక్ నాథ్ షిండే

మన తెలంగాణ/ధర్మపురి : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ధర్మపురిలో బిజెపి అభ్యర్థి ఎస్. కుమార్‌కు మద్దతుగా మంగళవారం నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ముఖ్యమంత్రి షిండే పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుదన్నారు.

పిఎం మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్క రోజు విశ్రాంతి తీసుకోకుండా పనిచేశారన్నారు. దేశంలో కొన్ని పార్టీలు మోడీని ఓడించడానికి కూటమి ఏర్పాటు చేసి జట్టు కట్టినవారే ఓటమి పాలయ్యారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందు తున్నాయని, తెలంగాణలోను డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడాలని అకాంక్షించారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం జరుగుతుందని గతంలో ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మోడీ పాలనలో దేశం ఆర్థికారంగంలో ఎంతో పురోగతి సాధించింనద్నారు. మోడీ నాయకత్వాన్ని బలపరచి బిజెపికి ఓటు వేసి ధర్మపురి అభ్యర్థి కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. అలాంటి పార్టీలకు ఓటుతోనే బుద్ధ్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి బిజెపి అభ్యర్థి కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి, నాయకులు కన్నం అంజయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్,వైకుంఠం, గంగారాం, సత్యం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News