Tuesday, April 1, 2025

జర్నలిస్టుపై ఎసిపి దాడి… ఖండించిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జర్నలిస్టుపై ఎసిపి  దాడిని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖండించారు. బిగ్ టివి రిపోర్టర్ సైదులుపై ఎస్సార్ నగర్ ఎసిపి దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఇది మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని, పోలీసులు ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వాళ్లు వారి విధులు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News