- Advertisement -
బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం వాయుగుండంగా బలపడనుందని, వాయవ్య దిశగా పయనించి రాబోయే 48 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో దక్షిణ రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
- Advertisement -