Wednesday, December 25, 2024

ఆ కారు చూడు… ఆ రంగు చూడు

- Advertisement -
- Advertisement -

పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు  

ఈసారి ప్రపంచకప్ వన్డే టోర్నమెంటులో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది.  బాబర్ ఆజమ్ నాయకత్వంలో పాక్ జట్టు కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దాంతో ఆ జట్టు ఆటగాళ్లకు స్వదేశంలో ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. పాక్ ఓటమికి బాధ్యత వహిస్తూ, బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

ఇదిలా ఉంటే, తాజాగా బాబర్ ఓ కొత్త కారుకొన్నాడు. దీని ఖరీదు పాక్ కరెన్సీలో 26 కోట్ల రూపాయల పైమాటే. అయితే, తాను కొన్న కారుతో అతను రిలీజ్ చేసిన ఓ ఫోటో  ఇప్పుడు బాగా ట్రోలింగ్ కు గురవుతోంది. పర్పుల్ కలర్ లో ఉన్న ఈ కారును చూసి, ఇంకేం రంగూ దొరకలేదా బాబర్ అని కొందరు, నిన్నూ నీ కారునూ  చూస్తుంటే టార్జాన్.. ది వండర్ కార్ సినిమా గుర్తుకొస్తోందని ఇంకొందరూ ఆటపట్టిస్తున్నారు. అజయ్ దేవగన్ నటించిన టార్జాన్.. ది వండర్ కార్ సినిమాలోనూ అచ్చం ఇలాంటి కారే ఉండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News