Saturday, December 21, 2024

తమిళనాడులో భారీ చోరీ..

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలో 2 కేజీల బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి నగలను దొంగిలించారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి రాష్ట్రంలోని కోయంబత్తూరు గాంధీపురంలో చోటుచేసుకుంది. గాంధీపురంలో ఉన్న జోయాలుక్కాస్ నగల షాపులో ఓ వ్యక్తి అర్థరాత్రి నగల దూకాణంలోకి చొరబడి రెండు కేజీల ఆభరణాలను సంచిలో నింపుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఉదయం షాపు తెరచి చూసిన యజమాని షాకయ్యాడు. తన షాపులో దొంగలు పడ్డారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ సీసీటివి పుటేజ్ ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, క్లూస్ టీమ్ లు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News