Saturday, December 21, 2024

డికె శివకుమార్ ఆస్తుల కేసు.. మెమో దాఖలుకు కోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : డిప్యూటీ సిఎం డికె శివకుమార్ కు చెందిన మితిమీరిన ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ కాలంలో ఈ దర్యాప్తు చేయడానికి సిబిఐకి సింగిల్ జడ్జి అనుమతించారు. దీనిపై సింగిల్ జడ్జి ఉత్తర్వును సవాలు చేస్తూ డికె శివకుమార్ అప్పీలు చేశారు. ఇప్పుడు ఈ అప్పీలు ను ఉపసంహరించుకోడానికి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు అవకాశం కల్పించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలు చేసిన అపీలును ఉపసంహరించుకోవాలని కాంక్షిస్తున్నట్టు మెమో దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు బుధవారం సూచించింది.

దీనిపై శివకుమార్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ దర్యాప్తుకు అనుమతించే విషయం సవాలులో ఉన్నప్పుడు , దాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకోడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. అందువల్ల ఈ అంశం ఇక పనికిరానిదైందని వివరించారు. ఈ నేపథ్యంలో ఉపసంహరించుకోడానికి ఆదేశించడానికి శివకుమార్‌కు అర్హత ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News