Monday, January 20, 2025

డిసెంబర్ 1న జనసేన కీలక సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన పార్టీ ఏపిలో ఎన్నికలకు సన్నద్దమవుతోంది. పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ డిసెంబర్ ఒకటిన కీలక సమావేశం నిర్వహింబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏపిలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు హాజరు కానున్నారు. పార్టీలోని పిఏసి సభ్యులు, కార్యవర్గసభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు , నియోజకవర్గ బాధ్యులు ,

అనుబంధ విభాగాల చైర్మన్లు మహిళా విభాగం సమన్వయ కర్తలు ,అధికార ప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. ఆంధ్రపదేశ్ లో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయుత్తం చేసే అంశంపై పార్టీ అధినేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు. జనసేన తెలుగుదేశం క్షేత్ర స్ధాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు ,ఓటర్ల జాబితాల పరిశీలన తదితర అంశాలను సమావేశంలో చర్చించనున్నట్టు హరిప్రసాద్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News