Saturday, November 16, 2024

డ్వాక్రా బృందాలకు డ్రోన్లు.. రూ 8 లక్షల చొప్పున సాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతి డ్వాక్రా బృందానికి డ్రోన్ల కొనుగోళ్ల కోసం రూ 8 లక్షల చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. నదేశంలోని స్వయం సహాయక బృందాలు (ఎస్‌జిహెచ్) ఈ సాయంతో డ్రోన్లను సంతరించుకుంటాయి. డ్రోన్ల వినియోగం , వాటి ద్వారా క్రిమిసంహారక మందులు చల్లడం, పొలాలకు బలవర్థకాలు చేరేలా చేయడం వంటి వాటిపై గ్రూప్‌ల వారిగా నిపుణులతో శిక్షణలు ఇప్పిస్తారు. రెండేళ్ల కాలానికి ఈ డ్రోన్ల పంపిణీకి అయ్యే వ్యయం రూ 1,261 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

ప్రతి బృందానికి ఓ డ్రోను అందిస్తారు. దీనికోసం ప్రతి బృందం రూ 8 లక్షల మేర సాయం పొందేలా ఏర్పాట్లు చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం నిర్ణీత 15000 ఎస్‌హెచ్‌జిలకు డ్రోన్లను 2024 2025 తరువాత 2025 26 ఆర్థిక సంవత్సరాలకు వర్తించేలా ఈ ఆర్థిక సాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులకు ఈ బృందాలు అద్దె ప్రాతిపదికన ఈ డ్రోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా లాభం పొందేందుకు వీలేర్పడుతుంది. ప్రతి డ్రోనుకు దాదాపు రూ 10 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో 80 శాతం వరకూ కేంద్రం డ్వాక్రా బృందాలకు ఆర్థిక సాయం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News